- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెనడాలో అగ్ని ప్రమాదం: భారత సంతతి కుటుంబం మృతి
దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని అంటారియో ప్రావీన్సులో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత సంతతి కుటుంబం మరణించింది. ఈ నెల 7న బ్రాంప్టన్‌లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించినట్టు పీల్ పోలీసులు వెల్లడించారు. ఘటనా విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత నివాస భవనంలో మృత దేహాలను కనుగొన్నారు. కానీ వారి వివరాలు ధ్రువీకరించలేదు. దీంతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్ వారికూ(51), అతని భార్య శిల్పా కోతా(47), వారి కుమార్తె మహేక్ వారికూ(16)గా గుర్తించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు..కానీ ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని భావిస్తున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మరణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సమాచారం తెలిసిన ఎవరైనా ముందుకు రావాలని పోలీసులు తెలిపారు. సుమారు 15ఏళ్లుగా కుటుంబం వాన్ కిర్క్ డ్రైవ్ ఏరియాలోనే నివసిస్తున్నట్టు స్థానికులు తెలిపారు.