suicide attempt : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
suicide attempt : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఖమ్మం రూరల్ : తన భూమిని జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఆక్రమించి దున్నుకుంటున్నాడనే ఆరోపణతో ఏలేటి వెంకటరెడ్డి (45) అనే రైతు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం రూరల్ మండలం, జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకట్ రెడ్డి తనకున్న మూడెకరాలలో భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నాడు. కొద్దికాలం క్రితం వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి వద్ద జాటోత్ వీరన్న భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమి సాగుకు అనుకూలంగా లేదని, పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని కబ్జా చేసి హద్దులు మార్చి ఆక్రమించేందుకు వీరన్న

ప్రయత్నిస్తున్నాడని వెంకటరెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై పలు మార్లు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టుకున్నారు. 2021లో ఇదే వివాదంలో వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి పురుగుల మందు తాగి మృతి చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. తమ్ముడు భూమిని కొనుగోలుచేసి అన్న భూమిని కబ్జాకు పాల్పడుతూ ట్రాక్టర్ తో దున్నుతున్నాడని రైతు వెంకట్ రెడ్డి ఆపేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో మనస్థాపంతో ఆదివారం పురుగుల మందు తాగుతూ సెల్పీ వీడియో తీశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంకటరెడ్డిని ఖమ్మం సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed