- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు తయారీ.. పక్కా సమాచారంతో పోలీసుల ఎంట్రీ!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగ్‌లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ.. ఫేక్ ప్రకనటలు చూసి మోసపోవద్దని సూచించారు. టీవీల్లో, సెల్‌ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందని గుర్తుచేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ మెడిసిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.