Drug seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీబీఐ తనిఖీలు.. భారీ ఎత్తున కొకైన్ స్వాధీనం

by Shiva |
Drug seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీబీఐ తనిఖీలు.. భారీ ఎత్తున కొకైన్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని సీబీఐ, టాస్క్‌ఫోర్స్, పోలీసు సిబ్బందికి విస్తృతంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే దోహా నుంచి ఢిల్లీకి డ్రగ్స్ రవాణా చేస్తున్నారని ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మాటు వేశారు. దోహ నుంచి వచ్చిన అశోక్ కుమార్ అనే భారత సంతతి జర్మనీ వ్యక్తిని సీబీఐ అధికారులు గురువారం టెర్మినల్ 3 వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడిని, లగేజీని క్షణ్ణంగా తనిఖీ చేయగా రెండు బొమ్మల్లో దాచిన 270 క్యాప్స్యూల్స్ రూపంలో ఉన్న ఆరు కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సరుకు విలువ ఓపెన్ మార్కెట్‌లో రూ.30 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.

Advertisement

Next Story