HYD: హోంమంత్రి మహమూబ్ అలీపై ఫిర్యాదు

by GSrikanth |
HYD: హోంమంత్రి మహమూబ్ అలీపై ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హోంమంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్‌పై దాడి చేయడం దారుణమని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ పేర్కొన్నారు. హోంమంత్రి అంటే ఏదైనా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీపై ఆయన శుక్రవారం SR నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో గన్ మెన్‌ను అవమానపరచడం దుర్మార్గమన్నారు.

హోంమంత్రికి ఎలాంటి హని జరగకుండా రక్షణగా ఉండే గన్ మెన్లపై దాడి కల్చర్ మహమూద్ అలీ సృష్టించారన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఇంకా ఎన్ని ఉన్నాయో? అనే అనుమానం కలుగుతుందన్నారు. డ్యూటీలో ఉన్న గన్ మెన్‌పై దాడి చేసిన హోంమంత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఇదిలా ఉండగా.. మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడ? అంటూ గన్ మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెల్లుమనిపించారు. దీంతో షాక్ అయిన సదరు గన్ మెన్ నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.

Advertisement

Next Story