BREAKING: తూర్పు గోదావరి జిల్లాలో దుండగుల బీభత్సం.. నల్లజర్ల పోతవరంలో దారి దోపిడీ

by Shiva |
BREAKING: తూర్పు గోదావరి జిల్లాలో దుండగుల బీభత్సం.. నల్లజర్ల పోతవరంలో దారి దోపిడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోతవరంలో దుండగులు బీభత్సం సృష్టించారు. కారులో జంగారెడ్డి గూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న ఓ బంగారం వ్యాపారిని ఐదుగురు ఆగంతకులు పథకం ప్రకారం అడ్డుకున్నారు. అనంతరం అతడి వద్ద ఉన్న మూడున్నర కేజీల బంగారం, రూ.5 లక్షల నగదును లాక్కొని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ మేరకు సదరు వ్యాపారి నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story