BREAKING: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ బ్రదర్స్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు.. పోలీసుల విచారణలో నిజాలు బట్టబయలు

by Shiva |
BREAKING: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ బ్రదర్స్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు.. పోలీసుల విచారణలో నిజాలు బట్టబయలు
X

దిశ, వెబ్‌డెస్క్: గంజాయితో ఇవాళ పోలీసులకు పట్టుబడిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్‌ బ్రదర్స్‌పై బాధితురాలు మౌనిక సంచలన ఆరోపణలు చేసింది. పోలీసుల విచారణలో భాగంగా సంచలన విషయాలను బయటపెట్టింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను నమ్మించి మోసం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని మౌనిక ఆరోపించింది. విషయం ఎవరికైనా చెబితే పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ అన్నదమ్ములు బెదిరించాడిని పేర్కొంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సంపత్ కోసం వెళితే.. షణ్ముఖ్ నివాసంలో గంజాయి, మత్తు పదార్థాలు లభించాయని తెలిపారు. ఈ మేరకు సంపత్‌పై చీటింగ్, రేప్ కేసులు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు. ఇక గంజాయి విషయంలో షణ్ముఖ్ పాత్రపై విచారిస్తున్నామని తెలిపారు. సంపత్ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని ఏసీపీ వెల్లడించారు.

Advertisement

Next Story