BREAKING: హైదరాబాద్ బాలానగర్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత

by Shiva |
BREAKING: హైదరాబాద్ బాలానగర్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత
X

దిశ, వెబ్‌‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల అధినేతలు, నాయకులు గెలుపే లక్ష్యంగా ఎన్నికల కదన రంగంలోకి దిగారు. పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా చేపట్టి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు డబ్బు, ఇతర వస్తువులతో తాయిలాల ఆశ చూపి ఓట్లు రాబట్టేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే, వాటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల్లో పోలీసులు ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేష్లన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో వాహనాలు ఆపి చెక్ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తుండగా రూ.10.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story