BREAKING: గ్యాస్ డెలివరీ బాయ్ ఘాతుకం..! అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

by Shiva |
BREAKING: గ్యాస్ డెలివరీ బాయ్ ఘాతుకం..! అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరిన విద్యార్థిని అనంతలోకాలకు వెళ్లిపోయింది. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన శైలజ కాసేపటికే కడుపు నొప్పి అంటూ ఇంటికి వచ్చేసింది. అలా వచ్చిన తను వాళ్లింటి సమీపంలో ఉన్న గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. దీంతో శైలజ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు ఇంటిని క్షణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో అతడి ఇంట్లో శైలజ స్కూల్ బ్యాగ్, బుక్స్ లభించాయి. కాగా, కుటుంబ సభ్యులు తమ కూతురును చంపేశాడంటూ అనుమానం వ్యక్తి చేస్తున్న డెలివరీ బాయ్ నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.



Next Story