- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SP Sarath Chandra Pawar : మోసం చేశారు.. డబ్బులు దోచారు..
దిశ, మిర్యాలగూడ : ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామని నమ్మబలికి వడ్డీగా 60 లక్షల రూపాయలు ముందే చెల్లించాలని నమ్మించి 60 లక్షల రూపాయలతో పరారైన 9 మంది నిందితులలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బుధవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. హైదరాబాదులోని చందానగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమీర్ అనే వ్యాపారి నిజమాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఐదు కోట్ల రూపాయల అవసరం ఉన్నట్లు శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ చెందిన కండెల గణేష్, మల్లికార్జున్ లను సంప్రదించారు. కాగా వీరు 5 కోట్ల రూపాయలు అప్పుగా సమకూర్చడానికి ఒప్పందం చేసుకొని గత నెల 31న అబ్దుల్ సమీర్ ను నమ్మించడానికి 90 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి ఆయన వద్ద నుండి బ్యాంకు చెక్కులు, ప్రాంసరీ నోటు, ఇంటి కాగితాలను తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఈనెల 5న తాము మొదటగా ఇచ్చిన 90 లక్షలతో పాటు ఇవ్వబోయే ఐదు కోట్ల రూపాయలకు వడ్డీగా 60 లక్షల రూపాయలు తీసుకొని మిర్యాలగూడకు రమ్మని సమీర్ కు తెలియజేశారు.
దీంతో సమీర్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి సాయంత్రం నాలుగు గంటల సమయంలో మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ లో గల వీరన్న అనే వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న నిందితులు కండేల గణేష్, మల్లికార్జున్, విజయ్, రాజు, గంగమ్మ, ఎల్బీనగర్ కు చెందిన కండేల అనుపమ, హైదరాబాద్ కొంపెల్లికి చెందిన కండేల వెంకటమ్మ మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ కు చెందిన కండేల వీరమ్మలు సమీర్ తో మాట్లాడి అప్పుగా ఇచ్చిన 90 లక్షల రూపాయలను తీసుకొని వారి వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి కాగితాలను తిరిగి ఇచ్చేశారు. అనంతరం ఐదు కోట్ల రూపాయల అప్పుగా ఇస్తుండడంతో వడ్డీ 60 లక్షల రూపాయలను చూపించాలని కోరారు. 60 లక్షల రూపాయలను చూపిన వెంటనే గణేష్, మల్లికార్జున్, విజయ్, రాజులు సమీర్ తో పాటు ఉన్న వ్యక్తుల పై దాడి చేసి 60 లక్షల రూపాయలతో అందరూ కలిసి పారిపోయారు.
వెంటనే బాధితులు 100 సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మూడు గ్రూపులుగా ఏర్పడి 60 లక్షల రూపాయలతో పారిపోతున్న అనుపమ, వీరమ్మ, వెంకటమ్మలను బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 60 లక్షల రూపాయలు, మనీ కౌంటింగ్ మిషన్, రెండు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులైన కండేలా గణేష్ అలియాస్ ప్రవీణ్, మల్లికార్జున్, విజయ్, రాజు, వీరన్న, గంగమ్మ లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ నిందితుల పై ఇదే తరహాలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసునమోదు అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసుఛేదించడంతో డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ సుధాకర్, ఎస్సై శేఖర్, టూ టౌన్ సీఐ నాగార్జున, రూరల్ ఎస్సై నరేష్ లను ఎస్పీ అభినందించారు.