అమెరికాలో మరోసారి కాల్పులు: కుటుంబ సభ్యులనే హతమార్చిన నిందితుడు

by samatah |
అమెరికాలో మరోసారి కాల్పులు: కుటుంబ సభ్యులనే హతమార్చిన నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. నిందితుడు తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను కాల్చి చంపాడు. ఈ ఘటన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగింది. కాల్పుల అనంతరం నిందితుడు దొంగిలించిన కారులో న్యూ జెర్సీకి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 26ఏళ్ల ఆండ్రీ గోర్డాన్ జూనియర్‌గా గుర్తించారు. మృతి చెందిన వారిని గోర్డాన్ సవతి తల్లి కరెన్ గోర్డాన్, సోదరి కేరా గోర్డాన్, మరో వ్యక్తిని టేలర్ డేనియల్‌గా తెలిపారు. నిందితుడు పెన్సిల్వేనియాలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో తన కుటుంబ సభ్యులను హత్య చేశాడు. గోర్డాన్ ఆధునిక రైఫిల్‌తో కాల్పులకు పాల్పడినట్టు పెన్సిల్వేనియా పోలీసులు వెల్లడించారు. దాడి సమయంలో నిందితుడు తమ ఇంటి దగ్గరి నుంచే వెళ్లే వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు.

Advertisement

Next Story