dead body : రామాలయం సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యం

by Sridhar Babu |
dead body : రామాలయం సమీపంలో  గుర్తు తెలియని శవం లభ్యం
X

దిశ, భద్రాచలం టౌన్ : రామాలయం గుడి సమీపంలో ఓ గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడని భద్రాచలం పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి 60 నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉంటాడని తెలిపారు. చామనచ్ఛాయ శరీర రంగు కలిగి తెలుపు రంగు జుట్టు , తెలుపు రంగు గడ్డం కలిగి ఉండి కాషాయ రంగు చొక్కాని ధరించి గళ్ల లుంగీ తో ఉన్నాడని పేర్కొన్నారు. ఇతను గత కొంత కాలం నుండి గుడి సమీపంలో భిక్షాటన చేస్తూ ఉన్నట్టు చెప్పారు. ఎవరైనా ఈ వ్యక్తి కి చెందిన కుటుంబసభ్యులు ఉంటే భద్రాచలం పోలీస్ స్టేషన్ కి ఈ 8712682106 సెల్​ నంబర్​కి సంప్రదించాలని భద్రాచలం టౌన్ ఎస్ఐ కోరారు.

Advertisement

Next Story