ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

by Kalyani |
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
X

దిశ, మిర్యాలగూడ : నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని వెనకనుంచి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడ రూరల్ మండలం జటావత్ తండాకు చెందిన జటావత్ కాంతి (61) పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా అదే తండా చెందిన జటావత్ నవీన్ ద్విచక్ర వాహనం వెనుక నుండి బలంగా ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, మృతురాలు కుమారుడు శీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జానకిరాముడు తెలిపారు.

Advertisement

Next Story