లంచం తీసుకుంటూ సీసీఎస్‌లో అడ్డంగా బుక్కైన ఇన్స్‌పెక్టర్

by Satheesh |
లంచం తీసుకుంటూ సీసీఎస్‌లో అడ్డంగా బుక్కైన ఇన్స్‌పెక్టర్
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్‌లో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఓ ఇన్స్ పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీసీఎస్‌లోని ఈఓ డబ్ల్యూ(ఆర్ధిక నేరాల నియంత్రణ విభాగం)కు చెందిన ఇన్స్ పెక్టర్ సుధాకర్ తన పరిధిలో నమోదైన కేసుకు సంబంధించిన విషయంలో బాధితుడు మణి రంగాస్వామికి సహాయం చేసేందుకు, కేసులో శిక్ష పడకుండా చేసేందుకు 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకోగా, రెండు విడుతలో రూ.3 లక్షలు తీసుకుంటుండగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యక్షంగా సీసీఎస్‌లో తన ఛాంబర్ వద్ద నగదును తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఈ రూ.15 లక్షల లంచం ఇంకా ఎవరెవరికి లింక్ ఉందనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ ఇన్స్‌పెక్టర్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలను జరుపుతున్నారు. ఇన్స్ పెక్టర్ సుధాకర్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ఆదాయానికి మించిన కేసుతో సంచలనంగా మారిన సీసీఎస్ విభాగం మరోసారి ఏకంగా సీసీఎస్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటు ఇన్స్‌పెక్టర్ పట్టబడడంతో మరోసారి సీసీఎస్ విభాగం అప్రతిష్టను మూటగట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed