తెలంగాణలో సంచలన ఘటన.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసిన ఉన్మాది

by GSrikanth |
తెలంగాణలో సంచలన ఘటన.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసిన ఉన్మాది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలన ఘన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో సాయి అనే ఓ ఉన్మాది యువతి గొంతు కోసిన ఘటన కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్న సదరు ఉన్మాది.. గురువారం యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో దూరి బ్లేడ్‌తో గొంతు కోశాడు. అరుపు కేకలను విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ప్రస్తుతం యువతి కరీంనగర్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story