- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prisoner Escaped : పోలీసులకు మస్కా కొట్టి రిమాండ్ ఖైదీ పరారీ!
దిశ, వెబ్‌డెస్క్ : పోలీసులకే బురిడీ కొట్టించాడు ఓ స్మగ్లర్. జైలుకు తరలిస్తుండగా మస్కా కొట్టి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం.. గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన నరేష్ రవాణా చేస్తూ ఇటీవల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించేందుకు ఎస్కార్ట్ పోలీసులు విశాఖ నుంచి అనంతపురానికి రైల్లో తరలిస్తుండగా ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు నరేష్ చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి ఎస్కేప్ అయ్యాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. పరారీ అయిన నరేష్ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా, నరేష్‌పై గుత్తి, గుంతకల్లు, ముంబయి పోలీస్ స్టేషన్లలో దొంగతనం, గంజాయి స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి.