సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

by GSrikanth |
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని మారేడుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు అలుముకున్నట్లు సమాచారం. దీంతో ఆ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed