- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganja selling : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు మరో ఐదుగురి అరెస్ట్
దిశ, ఇబ్రహీంపట్నం : బీటెక్ చదువుతున్న ఓ యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఆరుగురి వ్యక్తులను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. విద్యానగర్, హుజురాబాద్, కరీంనగర్ కు చెందిన శ్రీరాముల సాత్విక్ (21) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. తాను ఇంటర్ చదువుతున్న క్రమంలో గంజాయికి అలవాటు పడ్డాడు. 2021లో ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో బీటెక్ లో చేరి 1వ సెమిస్టర్ వరకు కళాశాల హాస్టల్లో చేరాడు. ఆ తర్వాత అతని స్నేహితులు విశ్వాస్, సంపత్తో కలిసి ఇబ్రహీంపట్నంలో రూమ్ అద్దెకు తీసుకొని చదువు కొనసాగిస్తున్నారు.
రూమ్మెట్ విశ్వాస్ ద్వారా పాత నేరస్తుడైన నవీన్ అనే సిరిసిల్ల, ఇల్లంతకుంటకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నవీన్ గంజాయిని సరఫరా చేసేవాడని తెలుసుకున్నాడు. మొదట్లో సాత్విక్ తాగేందుకు నవీన్ నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఒకసారి సాత్విక్, నవీన్ గంజాయి కొనుగోలు కోసం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి, అతను కొంత మొత్తంలో గంజాయిని సేవించాడు. మిగిలిన వాటిని చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఇబ్రహీంపట్నం, పరిసర ప్రాంతాలతో పేద విద్యార్థులతో పాటు ఇతరులకు విక్రయిస్తున్న క్రమంలో మీర్పేట్ పోలీసులకు పట్టుబడి 22-11-2023న జైలుకు వెళ్లి వచ్చిన సాత్విక్ మళ్లీ హాస్టల్ చేరాడు. గంజాయి సేవించడానికి తన స్నేహితుల గదులకు వెళ్లేవాడు. ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అతను సిరిసిల్లలోని ఇల్లంతకుంటకు వెళ్లి తన పాత చిరువ్యాపారుడైన నవీన్ ను కలుసుకుని 500 గ్రాముల గంజాయిని రూ.5వేలు
చెల్లించి తెచ్చుకుని విక్రయించేందుకు ఇబ్రహీంపట్నంలోని తన హాస్టల్ కు వచ్చాడు. అనంతరం ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం భరత్ హాస్టల్ లో తన స్నేహితులకు గంజాయి విక్రయింస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్స్ వ్యాపారి అయిన సాత్విక్ తో పాటు ఐదుగురిని పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి145.8 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేసీవీ రాజు మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మారక ద్రవ్యాల బారిన పడవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సూచించారు. అనుమానం వచ్చినట్లైతే ఫోన్. 8712671111 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ దాడిలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు రామకృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.