- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
crime : భారీ వృక్షం మీద పడి వ్యక్తి మృతి
దిశ, ఏటూరునాగారం : జాతీయ రహదారి 163 పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై భారీ వృక్షం మీద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఏటూరునాగారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన జాంగిర్ (30) పని నిమిత్తం చిన్న బోయినపల్లి జాతీయ రహదారి 163 మార్గంపై ద్విచక్ర వాహనంపై ఏటూరు నాగారం వెళ్తుండగా పోతురాజు బోరు సమీపాన జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షం నేలకూలి జాంగిర్ మీద పడింది.
ఈ ఘటనలో జాంగిర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డుపై అడ్డంగా కూలిన భారీ వృక్షం కారణంగా ట్రాఫిక్ జాం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సై తాజుద్దీన్ పోలీస్ సిబ్బందితో కలిసి జేసీబీతో భారీ వృక్షాన్ని తొలగించి యథావిధిగా రాకపోకలు కొనసాగేలా చేశారు.
- Tags
- crime