- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
crime : ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ...ఒకరు మృతి
దిశ, హనుమకొండ టౌన్ : అతివేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డ సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుండి గుడెప్పాడుకు ద్విచక్ర వాహనం మీద వస్తున్న దంపతులను, వరంగల్ నుండి పరకాలకు వస్తున్న లారీ
అతివేగంగా ఆత్మకూరు మండలం గుడెప్పాడు క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో దంపతులు బలబద్ర భావని (23), ఆమె భర్త బలభద్ర దినేష్, రెండు సంవత్సరాల బాలుడు ద్విచక్ర వాహనం పై నుండి ఎగిరిపడ్డారని, భావని పైన లారీ ముందు టైరు ఎక్కడంతో పొట్ట పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూర్ సీఐ సంతోష్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షేత్రగాత్రులను 108 లో ఎంజీఎం కు తరలించారు. చికిత్స పొందుతూ భావని మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఆమె భర్త దినేష్, కుమారుడు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
- Tags
- crime