బాలుడి మృతికి కారణమైన ఇద్దరిపై హత్య కేసు నమోదు..

by Disha Web Desk 23 |
బాలుడి మృతికి కారణమైన ఇద్దరిపై హత్య కేసు నమోదు..
X

దిశ,ఆసిఫాబాద్ : నాటువైద్యం పేరుతో రెబ్బెన లో నంబాల గ్రామానికి చెందిన రిషి అనే బాలుడి మృతికి కారణమైన బామినే భీంరావ్ తండ్రి శ్రీనివాస్ పై హత్య కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ సదయ్య తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2020లో రిషి అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు శ్రీనివాస్,మల్లేశ్వరి ఇద్దరు బాబుని తీసుకుని పాసిగాం గ్రామంలోని బామినే భీంరావు వద్ద నాటు వైద్యం కోసం వెళ్లారు. రిషిని ఆశ్రమం లో ఉంచి వైద్యం చేయాలని చెప్పడంతో తల్లి మల్లేశ్వరి తిరిగి ఇంటికి వెళ్ళిగా తండ్రి శ్రీనివాస్ అబ్బాయితో ఉన్నాడు.

ఇదే క్రమంలో రిషి వైద్యం లో భాగంగా ఆశ్రమంలో పూజలు, నాటు వైద్యం చేసే క్రమంలో రిషి మృతి చెందాడు. బాలుడు మృతి చెందిన విషయం బయటపడితే ఆశ్రమానికి ఎవరు రారని ఇద్దరం ఇబ్బందుల్లో పడతారని శ్రీనివాస్ ని భయపెట్టి రిషి మృతదేహాన్ని ఎవరి చెప్పకుండా పాతి పెట్టారు. మూడేళ్లుగా కొడుకు విషయమై శ్రీనివాస్ ను పలుమార్లు భార్య నిలదీసిన ఎదో ఒక సాకు చెప్పేవాడు. ఇదే విషయాన్ని భీంరావు కూడా పలుమార్లు అడుగగా లైంగిక వేధింపులకు గురి చేయడంతో నాలుగు రోజుల కిందట మల్లేశ్వరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రిషి పాతి పెట్టారని, శ్రీనివాస్, భీం రావులు పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు, విచారణ కోసం కోర్టు నుంచి ఇద్దరి జ్యుడీషియల్ కస్టడీ కోరనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed