వ్యక్తి పై హత్యాయత్నం కేసు నమోదు

by Sridhar Babu |
వ్యక్తి పై హత్యాయత్నం కేసు నమోదు
X

దిశ, బషీరాబాద్ : వ్యక్తి పై హత్యాయత్నం కేసు నమోదైంది. తరుచూ గొడవలకు పాల్పడటమే కాకుండా పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి లో ప్రవర్తన మారలేదు. తాజాగా జరిగిన సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మయి గ్రామానికి చెందిన నిందితుడు బోయిని నాగప్ప (40) అదే గ్రామానికి చెందిన సిరిగారి శ్యాం (35) పై మంగళవారం గొడ్డలితో

దాడి చేసి గాయపర్చాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్లు బషీరాబాద్ ఎస్ ఐ రమేష్ తెలిపారు. గతంలో బోయిని నాగప్ప పలు నేరలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story