- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తనపై చెడుగా ప్రచారం చేస్తున్నాడనే బీటెక్ విద్యార్థి హత్య
దిశ, బడంగ్ పేట్ : సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసు మిస్టరీని బాలాపూర్ పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేయడంతో పాటు తనపై చెడుగా చెబుతున్నాడన్న అనుమానంతోనే మాధవ్యాదవ్ పక్కా ప్రణాళికతో ప్రశాంత్‌ను ఆరుగురు స్నేహితులతో కలిసి హతమార్చినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రశాంత్‌ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఏడుగురు నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్ లతో పాటు ఐదు బైక్ లు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ తోట భూపతి తెలిపిన వివరాల ప్రకారం ... ఖమ్మం జిల్లా అయ్యవారి గూడెం ప్రాంతానికి చెందిన మోండ్రు అనిత, శాంతయ్య కుమారుడు మోండ్రు ప్రశాంత్ (21) నాదర్గూల్లోని ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ సంవత్సరం చదివేవాడు.
గత కొంత కాలం క్రితం తన తల్లి అనితతో కలిసి బతుకు తెరువు కోసం బాలాపూర్ గ్రామానికి వలస వచ్చారు. తల్లి అనిత ఇళ్లలో పాచిపని చేస్తూ కుమారుడు ప్రశాంత్‌ను చదివిస్తుంది. ఇది ఇలా ఉండగా బాలాపూర్‌కు చెందిన పి.రమేష్ కుమారుడు పోచబోయిన మాధవ్ యాదవ్ (24) వృత్తి రీత్యా పాల వ్యాపారి. ఇతనికి కొంత కాలం క్రితం మోండ్రు ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. మాధవ్ యాదవ్ కు ప్రశాంత్ కు మధ్య 10 నెలల నుంచి చిన్న చిన్న విషయాల్లో గొడవ జరిగేది. దీంతో ప్రశాంత్ పై మధవ్ యాదవ్ మనస్సులో కక్ష పెంచుకున్నాడు. అంతేగాకుండా తన ప్రియురాలితో ప్రశాంత్ చాటింగ్ చేయడంతో పాటు తనపై చెడుగా చెబుతున్నాడనే అనుమానం రోజు రోజుకు పెంచుకోసాగాడు. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్‌ను ఎలాగైనా హత్య చేస్తామని తన స్నేహితులైన నాదర్ గూల్ కు చెందిన చింతాల మహేష్ యాదవ్ అలియాస్ మళ్లి కార్జున్ (25), నాదర్‌గూల్‌కు చెందిన నామోజు సుమంత్ చారి, బాలాపూర్‌కు చెందిన నల్లపూసల మహేష్, బాలాపూర్ గ్రామానికి చెందిన దొడ్డి హరీష్, బాలాపూర్ గ్రామానికి చెందిన అఖిల్ కిరణ్ కుమార్, నాదర్‌గూల్ కు చెందిన కొహెడ యశ్వంత్‌తో కలిసి నిందితుడు హత్యకు పథకం రూపొందించాడు. ఈ నెల 22వ తేదీన బాలాపూర్‌లోని గణేష్ చౌక్ ప్రాంతంలోని 37మండి అరేబియన్ బిర్యాని సెంటర్‌ను అనువుగా ఎంచుకున్నారు.
ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న ప్రశాంత్‌కు ఫోన్ చేసి బిర్యాని సెంటర్ వద్దకు పిలుచుకున్నారు. అక్కడ పాన్ షాప్ వద్ద ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మాధవ్ యాదవ్ గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ప్రశాంత్‌పై విచక్షణా రహితంగా దాడిచేశాడు. పక్కనే ఉన్న చింతాల మహేష్ యాదవ్, నామోజు సుమంత్ చారిలు ప్రశాంత్ చేతులపై దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందడంతో మాధవ్ యాదవ్‌తో పాటు మరో ఆరుగురు స్నేహితులు పరారయ్యారు. మృతుని తల్లి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని, సీసీ కెమెరాల ద్వారా హత్యచేసి పారిపోతున్న నిందితులను గుర్తించారు. మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ప్రశాంత్‌ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న మాధవ్ యాదవ్ తో పాటు మహేష్‌యాదవ్, సుమంత్‌చారి, నల్ల పూసల మహేష్, దొడ్డి హరీష్, అఖిల్ కిరణ్ కుమార్, కొహెడ యశ్వంత్‌లను అదుపులోకి తీసుకుని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- murder