- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bodybuilder: గోవధ ఆరోపణలతో మూక దాడి.. యూపీలో మాజీ బాడీ బిల్డర్ మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ (Moradhabad)లో గోహత్య చేశారనే అనుమానంతో మాజీ బాడీ బిల్డర్‌పై పలువురు దుండగులు దాడికి పాల్పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసలాత్‌పురా(Asalathpura)కు చెందిన మాజీ బాడీ బిల్డర్ షాహిదీన్ (30) అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున ఆవును వధించడాన్ని కొంత మంది స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టడమే గాక, పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో షాహిదీన్ వెంటనే స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాధిత వ్యక్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. అయితే మరి కొందరు వ్యక్తులు పారిపోయారని పోలీస్ ఉన్నతాధికారి రణవిజయ్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలంలో ఆవు కళేబరం కూడా లభ్యమైందని పేర్కొన్నారు. ఈ హత్య అనంతరం మోరాదాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.