- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతర ప్రచార రథం షురూ...
దిశ, ఇంద్రవెల్లి : పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని ఈనెల 28న మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజ (జాతర)ను మెస్రం వంశీయులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి నెల వంకను చూసి మొక్కుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నాగోబా మురాడి వద్ద సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన సమావేశంలో మెస్రం వంశీయులు కూర్చొని నాగోబా మహాపూజ, నాగోబా జాతర గురించి చర్చించారు. అనంతరం నాగోబా మహా పూజకు సంబంధించిన ప్రచార రథాన్ని పూజ చేసి ప్రారంభించారు. మెస్రం వంశీయులు సంప్రదాయ ప్రకారం ఊరి పొలిమేరలో నేలపై తంబాకు, బీడీ వేసి నాగోబాని మొక్కుకొని ప్రచార రథాన్ని సాగనంపారు.
ఈ ప్రచార రథం ఏడు గ్రామాల్లో పర్యటించనుంది. కేశ్లాపూర్ నుండి ప్రారంభమై బయలు దేరిన ప్రచార రథం సిరికొండ మండలానికి చేరుకొని గుగ్గిల స్వామి ఇంటికి వెళ్లి మహా పూజకు కావలసిన కుండల తయారీకి ఆదేశాలు ఇస్తారు. 4న రాజంపేట గ్రామానికి వెళ్లి అక్కడే బస చేస్తారు. 5న గుడిహత్నూర్ మండలం సోయాంగుడకు, 6న ఇంద్రవెల్లి మండలం గిన్నెరకు, 8న ఉట్నూర్ మండలం సాలేవాడకు, 9న ఇంద్రవెల్లి మండలం వాడ గావ్ , 10 న వాడగావ్ నుండి కేస్లా పూర్ గ్రామానికి చేరుకుంటారని తెలిపారు. కెస్లాపూర్ లోని మెస్రం వంశీయుల పెద్దవాడైన మడవి ఇంటి వద్ద ఆరోజు బస చేస్తారు. అక్కడ నుండి పురాతన ఆలయం చేరుకొని సాంప్రదాయకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా జాతర మహా పూజకు కావలసిన పవిత్రమైన గంగాజలాన్ని సేకరించడానికి బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వెంకట్ రావ్ పటేల్, కటోడ మెస్రం కోసు, ప్రధాన్ మెస్రం దాదారావ్, మెస్రం చిన్ను మెస్రం వంశీయులు, మెస్రం నాగ్‌నాథ్, మెస్రం తుకారాం, మెస్రం తిరుపతి ఉన్నారు.