- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రభుత్వం నిషేధించిన గాలిపటం 'చైనా మాంజా' ను జిల్లాలో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. చైనా మాంజా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని,ఈ మాంజా తో తలెత్తే అనర్థాలపై అందరికి అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. నైలాన్,సింథటిక్ దారాలు పక్షులకు,పర్యావరణానికి,మనుషులకు హాని కలుగజేస్తాయని,జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు,ఈ మాంజాను అమ్మినా,రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని,జిల్లా పోలీసు కంట్రోల్ రూం నెంబర్ 8712659360 కు ఫోన్ చేసి తెలపాలని ఆమె సూచించారు.
Advertisement
Next Story