ఆకర్షణీయంగా దిశ క్యాలెండర్

by Sridhar Babu |
ఆకర్షణీయంగా దిశ క్యాలెండర్
X

దిశ, మంచిర్యాల : 2025 నూతన సంవత్సరం సందర్భంగా 'దిశ' యాజమాన్యం ఆధ్వర్యంలో ముద్రించిన 2005 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తన చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిశ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా క్యాలెండర్ ముద్రించారని చెప్పారు.

కలర్ ఫుల్ గా ఆకర్షణీయంగా క్యాలెండర్ ఉందని కొనియాడారు. కాగా ప్రజా సమస్యలను అనునిత్యం వెలుగులోకి తీస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని కోరారు. సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా మంచి ఆర్టికల్స్ అందించాలని సూచించారు. దిశ పత్రిక అభివృద్ధికి సిబ్బంది అంకితభావంతో పని చేయాలని కోరారు.

Advertisement

Next Story