విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి

by Kalyani |
విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి
X

దిశ, నల్లబెల్లి: విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మార్త రాజమౌళి శోభ దంపతుల కుమార్తె సృజన (20) బీటెక్ రెండవ సంవత్సరం హాస్టల్లో ఉంటూ చదువుతుంది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సృజన ఇంటి వద్దే ఉంటుంది. మంగళవారం రోజువారీ పనిలో భాగంగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి టీవీ పక్కన పడి ఉండటం గమనించారు. టీవీ వైరు పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి.

Advertisement

Next Story