ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్

by Naveena |
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్
X

దిశ, ఎల్లారెడ్డి : ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొట్టిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వస్తున్న బస్సును ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రుని ప్రభుత్వాసుత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేస్ తెలిపారు. క్షతగాత్రుడు కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story