- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ తరఫున 50 మంది లాయర్లు.. నేటి తీర్పుపై ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సహా 16 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ కేసుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ నేరం చేయని మట్టి బిడ్డను కావాలనే కేసులో ఇరికించారని కొంతమంది ప్రశాంత్‌ను సపోర్ట్ చేస్తుండగా.. నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది.. విన్నర్ అయినంత మాత్రాన అహంకారంతో మాట్లాడితే ఎలా..? అంటూ మరికొంత మంది విమర్శిస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనక రాజకీయ కోణం ఉందని.. దీనిపై సమగ్ర విచారణ చేయించాలని ఓ లాయర్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
మరోవైపు పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుఫున నాంపల్లి కోర్టులో లాయర్లు పిటిషన్ వేశారు. ఈ కేసును వాదించడానికి ఏకంగా 50 మంది లాయర్లు రంగంలోకి దిగడం గమనార్హం. ఒక్క పైసా ఫీజు తీసుకోకుండా రైతు బిడ్డ కోసం స్వచ్ఛందంగా వాదిస్తామని 50 మంది లాయర్లు ముందుకు వచ్చారు. ఒక మట్టి బిడ్డ కళాకారుడిగా ఎదిగిన తీరును నచ్చిన నాగార్జున బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చాడని.. అందరి సపోర్ట్‌తో విన్నర్ అయ్యి బయటకు వచ్చిన ఆయన్ను చేయని నేరంలో ఇరికించి అరెస్ట్ చేశారని లాయర్లు అన్నారు.
నేరం చేయని వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఏ విధంగా రిమాండ్ చేస్తారు? ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? అనే కోణంలో బెయిల్ పిటిషన్‌లో ఆర్గుమెంట్ చేశామని లాయర్లు వివరించారు. దాడులను మేము సమర్ధించం కానీ.. ఓ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. పోలీసుల వైఫల్యాన్ని ఏ సంబంధం లేని వారిపై మోపి అరెస్ట్ చేయడం తగదన్నారు. ఇది ఫాల్స్ కేసేనని కచ్చితంగా పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ వస్తుందని లాయర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసుపై నేడు నాంపల్లి కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. ఈరోజైనా బెయిల్ వస్తుందా.. రాదా..? అనే దానిపై రైతు బిడ్డ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.