- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏకంగా 31 వ్యవసాయ మోటార్లు కాజేశారు
దిశ, సూర్యాపేట : ఆ దొంగలు ఏకంగా 31 వ్యవసాయ మోటార్లు కాజేశారు. జిల్లాలోని పలు మండలాల్లో రైతుల బావులు, చెరువులు, వాగులపై ఉన్న మోటార్లు,వాటి నుండి వచ్చిన కాపర్ వైర్లను దొంగిలించిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కి పంపినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావుతో కలిసి వెల్లడించారు. జిల్లాలోని కోదాడ సబ్ డివిజన్ పరిధిలో గల రైతులు బావులు, వాగులు, చెరువులపై వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లతో పాటు మోటార్ కోర్ (కాఫర్ వైర్)లను కొందరు దొంగతనం చేస్తుండగా నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు.
ఈనెల 26 న గరిడేపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మల చెరువు రోడ్డులో పరెడ్డిగూడెం స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవానంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఉప్పతల వాసు, మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా పట్టుకొని విచారించారు. ఇద్దరి వద్ద రూ.5 లక్షల నగదు గుర్తించారు. పలు మోటార్లు, మోటార్ కోర్ వైర్ దొంగతనం చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరితో పాటు మోటార్ కోర్ అమ్మిన డబ్బులను మరో ఇద్దరు నిందితులు ఆకారపు వెంకటి, అజ్మీర మంత్రియ తో కలిసి మఠంపల్లికి చెందిన పాత సామాను వ్యాపారి శ్రీనుతో పంచుకున్నట్లు చెప్పారు.
అందుకు వారి వద్ద నుండి రూ.3.81 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, పాత సమాను వ్యాపారి శ్రీను వద్ద నుండి రూ.1.20 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.10 లక్షల ఒక వేయి డబ్బులు సీజ్ చేసినట్లు వివరించారు. పై నలుగురు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, చిలుకూరు పోలీసు స్టేషన్ ల పరిధిలో వ్యవసాయ బావులపై విద్యుత్తు మోటార్ లను దొంగిలించడం జరిగిందన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన హుజూర్ నగర్ సీఐ జి.చరమంద రాజు, గరిడేపల్లి ఎస్ఐలు సైదులు, సీహెచ్.నరేష్,ఐడి పార్టీ సిబ్బంది కానిస్టేబుల్ నాగరాజు, శ౦భయ్య, రామారావులను ఎస్పీ అభినందించారు.
- Tags
- Thieves