- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముదురుతున్న బిగ్‌బాస్ వివాదం.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ ఎపిసోడ్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ జూబ్లీహిల్స్‌లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం చేశారు అలాగే ఆరు ఆర్టీసీ బస్సులపై కూడా దాడి జరిగింది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను న్యూసెన్స్ కేసు కింద పోలీసులు అరెస్ట్ చేసి చంచలగూడ జైలులో ఉంచారు. ఇటీవల బెయిల్ రావడంతో రైతు బిడ్డ రిలీజ్ అయి బయటకు వచ్చాడు.
ఈ వివాదం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటుంది. తాజాగా, ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్ రెడ్డి, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టుకు చెందిన సుధాకర్ గొడవలో పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే పవన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ సీజన్-7 భారీ రేటింగ్ సంపాదించింది. ఈ సారి ఉల్టా పుల్టా కావడంతో చాలా మంది ప్రేక్షకులు ఆసక్తికరంగా బిగ్‌బాస్‌ను వీక్షించారు. ఇగ ఈ గొడవ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాకుండా నాగార్జునపై హైకోర్ట్‌లో పిటిషన్ సైతం దాఖలైంది.