- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై రియాక్టైన బిగ్ బాస్ కంటెస్టెంట్.. కన్నీళ్లతో రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పబ్లిక్ న్యూసెన్స్ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బుధవారం అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ భోలే షావలి తాజాగా స్పందింస్తూ ఎమోషనల్ అయ్యారు.
‘టైటిల్ విన్నర్‌గా ఎంతో సంతోషంగా బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఇలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఒక సెలబ్రేషన్ జరిగినప్పుడు చాలా మంది వస్తారు. అందులో కొందరు వేరే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారి వల్ల అందరికీ బాడ్ నేమ్ వస్తుంది. అంతమాత్రాన ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఇలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా అన్యాయం. ప్రశాంత్‌కు ఏం తెలియదు. మీడియా వాళ్లతో ఆయన ఏమైనా మిస్టేక్‌గా ప్రవర్తించి ఉంటే నా తరఫున సారీ చెబుతున్నాను. అతనికేం తెలియదు. అతను మట్టి బిడ్డ. పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో ఆటాడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తగిలించుకున్నాడు. రొమ్ము మీద దెబ్బ తగిలితే.. ‘అన్న ఇక్కడ నొస్తుంది నాకేమైనా అయితదా’ అని అడిగాడు. ఏం కాదు చెప్పాను. చాలా గొప్పగా ఆడాడు కాబట్టే.. ఈ రోజు విన్నర్‌గా నిలిచి తెలంగాణలో ఓ రైతు బిడ్డగా ఇంత సాధించాడు. ఈరోజు తను అరెస్ట్ అవ్వడం చాలా బాధగా ఉంది’ అంటూ ఎమోషనల్ అవుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియాలని, ప్రశాంత్‌ను రిలీజ్ చేసేలా చొరవ చూపించాలని భోలే రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.