- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20 రోజులు తీవ్ర రక్తస్రావం అయ్యింది.. బిగ్‌బాస్‌కు వెళ్లకపోతే ఇలా జరగకపోవు.. బోరున విలపించిన లేడీ కంటెస్టెంట్
దిశ, సినిమా: ఎన్నో వివాదాల మధ్య మొదలైన బిగ్‌బాస్ సీజన్ -7 చివరకు హ్యాపీ ఎండింగ్ అయ్యిందనుకునే సరికి అంతకు రెట్టింపు గొడవలయ్యాయి. విన్నర్ ప్రశాంత్ రన్నర్ అమర్ దీప్ బయటికి రాగానే ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడితో అమర్ దీప్ కారు డ్యామేజ్ కావడంతో పోలీసులు ప్రశాంత్‌ను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. ఇదంతా పక్కన పెడితే.. ప్రశాంత్ తోటి కంటెస్టెంట్ ప్రియాంక జైన్.. తన అమ్మకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని తాజాగా ఎమోషనల్ అయ్యింది.
అయితే ప్రియాంక జైన్ అమ్మ ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ప్రియాంక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బాధను వ్యక్తపరిచింది. ‘‘నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది. నా ఫ్యామిలీతో బెంగళూరుకు వెళ్లి హ్యాపీగా వారితో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పీరియడ్స్ టైం లో 15-20 రోజుల పాటు కంటిన్యూ గా బ్లీడింగ్ అయ్యేది.
పీరియడ్స్‌తో సంబంధం లేకుండా కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఏజ్ మీద పడుతుంది కదా.. ఏం కాదులే అని అమ్మ నెగ్లెక్ట్ చేసింది. ఆసుపత్రికి వెళ్లేసరికి క్యాన్సర్ అని తేలింది. నేను బిగ్ బాస్ కు వెళ్లకపోయుంటే ఇలా జరగకపోవు. అమ్మకు గర్భాశయాన్ని తీసేశారు. మీరంతా మా అమ్మ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మా కోసం ప్రేయర్ చేయండి. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు’ అంటూ ప్రియాంక జైన్ ఎమోషనల్ అవుతూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక జైన్ ఫ్యాన్స్ మీ అమ్మ త్వరగా క్యూర్ అవుతుంది మేడమ్ బాధపడకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక సీరియల్స్ లో నటించిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయిలతో సమానంగా ఆడి తన సత్తా ఎంతో నిరూపించుకుంది. టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచి.. లేడీ టైగర్‌గా పేరు సంపాదించుకుంది. హౌస్‌లో తన లవ్ మ్యాటర్‌ను కూడా బయటపెట్టింది. మరో సీరియల్ నటుడు శివ్ కుమార్ ను ప్రేమిస్తున్నానని.. చాలా కాలంగా వారు ప్రేమలో ఉన్నామని చెప్పింది. శివ్ కుమార్ కూడా ప్రయాంకను కలవడానికి బిగ్‌బాస్ హౌస్ కు వెళ్లిన విషయం తెలిసిందే.