- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss-7: అమర్ బెండు తీసిన బిగ్ బాస్.. గుండుకు రెడీ అయినట్లేనా..?
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున చెప్పినట్లుగా బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా, పుల్టా గానే సాగుతోంది. సక్సెస్‌ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే సందీప్, శివాజీ హౌస్ మేట్స్ కాగా.. ఈ వారం అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ తలపడనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు పవర్ అస్త్ర సంపాదించడానికి అనర్హులు అని చెప్పినా హౌస్ కంటెస్టెంట్స్‌తో కూడా పోటీ పెడుతున్నాడు బిగ్ బాస్.
ఈ క్రమంలోనే అమర్ దీప్ కంటే పవర్ అస్త్ర సాధించుకునేందుకు నేను అర్హురాలిని అంటూ చెప్పింది ప్రియాంక. దీంతో వీళ్లిద్దరి మధ్య ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదే హెయిర్ కట్ చేసుకోవడం. ఇందులో అమర్ దీప్ పూర్తిగా తన జుట్టు తొలగించుకుని గుండు చేయించుకోవాల్సి ఉండగా.. ప్రియాంక మెడ వరకు జుట్టు కత్తిరించుకోవాలి. ఈ టాస్క్ అమర్ ఇంకా ప్రియాంక ఇద్దరికి నచ్చలేదు. ఇక అమర్ మాత్రం.. నా జుట్టు రవితేజ జుట్టులా ఉంటుంది నేను తీయించుకోను అంటాడు. చూడాలి మరి బిగ్ బాస్ టాస్క్ ప్రకారం ఇద్దరిలో ఎవరు హెయిర్ కత్తిరించుకోవడానికి ఒప్పుకుంటారో.