హౌజ్‌లో బూతులు మాట్లాడుతున్న Amardeep.. తట్టుకోలేక బీప్ వేసిన Bigg Boss 7..

by Prasanna |   ( Updated:2023-09-15 15:57:57.0  )
హౌజ్‌లో బూతులు మాట్లాడుతున్న Amardeep.. తట్టుకోలేక బీప్ వేసిన Bigg Boss 7..
X

దిశ, సినిమా : సీరియల్ నటుడు అమర్ దీప్.. ఈ వారం నామినేషన్స్ టైమ్‌లో పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో అతనిపై జనాల్లో నెగెటివిటీ మొదలైంది. అయితే అతన్ని సమర్థించిన వారు లేకపోలేరు. కానీ రీసెంట్ ఎపిసోడ్‌లోనూ మరోసారి ప్రశాంత్ లక్ష్యంగా బూతులు తిట్టాడు. పవర్ అస్త్ర పొందే టాస్క్‌లో ప్రశాంత్ అతని దగ్గరున్న అస్త్రాన్ని తీసుకుని మరొకరికి ఇచ్చాడు. దీంతో ఆట ఎలా ఆడుతున్నారో చూడకుండా.. అంచనా వేయకుండా.. ఇంత చీప్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారోనని బట్టలు చింపుకున్నంత పనిచేశాడు. అదే కోపంలో వాష్ రూమ్‌కు వెళ్లి బూతులు తిట్టడం మొదలెట్టాడు. దీంతో తన ఫ్రెండ్స్ ప్రియాంక, శోభా శెట్టి వారించారు. మనం జనాల ముందు ఉన్నామన్న మాటలు మరిచిపోవద్దని హెచ్చరించారు. అయితే ఈ బూతులు తిట్టేటప్పుడు బిగ్ బాస్ బీప్ వేయడం విశేషం. కాగా కంట్రోల్ లేకుండా అంత పెద్ద బూతులు ఎలా తిడుతాడని కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్.. రైతు బిడ్డ అంటే అంత చిన్నచూపెందుకని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : హౌజ్‌లో మరో Love Track మొదలెట్టిన రతిక.. Bigg Boss 7 రాధికకు రైతు బిడ్డ సరిపోలేదా..?

Advertisement

Next Story