అయోధ్యలో జనవరి 16 నుండి 22 వరకు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..

by Sumithra |
అయోధ్యలో జనవరి 16 నుండి 22 వరకు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న కోట్లాది రామభక్తుల కళ జనవరి 22వ తేదీన నిజం కానుంది. అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే అనేక పూజాకార్యక్రమాలను నిర్వహించనున్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకి ముందు ప్రధాని మోదీ హనుమంతుని దర్శనం చేసుకోనున్నారు.

హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. అందుకే హనుమంతుని అనుమతి పొంది ఆయన ఆశీస్సులతో ప్రతిష్ఠాపన కార్యక్రామాన్ని నిర్వహించనున్నారు. పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా జనవరి 22న మధ్యాహ్నం 12:20 నుంచి 12:30 గంటల మధ్య ప్రాణ ప్రతిష్టాపన పూజ నిర్వహించనున్నారు. ప్రాణప్రతిష్ట కోసం సంజీవిని యోగం జరుగుతుంది. అనంతరం అభిజిత్ మహూర్తంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

ఇక వారం రోజుల ముందునుంచే అంటే జనవరి 16 నుంచి జరిగే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం..

జనవరి 16, 2024 : అమృత మహోత్సవాలు జనవరి 16 నుండి ప్రారంభం కానున్నాయి. ఆ రోజున, శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగింపుగా నగరంలోకి తీసుకెళనున్నారు.

జనవరి 17, 2024 : గణేశుడిని పూజించిన తర్వాత ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జనవరి 18, 2024 : ఈ పవిత్రమైన రోజున మండప పూజ, వాస్తు పూజ, వరుణ పూజ నిర్వహించనున్నారు.

జనవరి 19, 2024 : ఈ రోజున రామమందిరంలో యజ్ఞం, వేద మంత్రోచ్ఛరణలు, యజ్ఞకార్యాలు నిర్వహిస్తారు.

జనవరి 20, 2024 : ఈ రోజున ఆలయ గర్భగుడిలో 81 కలశాల ప్రతిష్ఠాపన జరుగుతుంది. ఈ కలశాలలో దేశంలోని వివిధ పవిత్ర నదుల నీరు నింపుతారు.

జనవరి 21, 2024 : ఈ రోజున రామ లల్లాకు అభిషేకం, యజ్ఞం నిర్వహిస్తారు.

జనవరి 22, 2024 : ఈ రోజున ప్రాణప్రతిష్టాపన జరుగుతుంది. ఈ రోజు నుంచి రామమందిరం రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చే క్షేత్రంగా మారనుంది.

రామమందిర ప్రత్యేకతలు

* ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇనుము, సిమెంటు వాడలేదు.

* శ్రీరామ మందిరంలో భక్తులకు ప్రసాదంగా చక్కెరను అందజేస్తారు.

* ఈ ఆలయంలో కలశాభిషేకం చేసేందుకు లక్ష రూపాయలు చెల్లించాలి.

* శ్రీరామ మందిరంలోని 24 మంది అర్చకుల్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed