మళ్లీ ప్రారంభమైన అయోధ్య మందిర నిర్మాణ పనులు.. పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

by GSrikanth |
మళ్లీ ప్రారంభమైన అయోధ్య మందిర నిర్మాణ పనులు.. పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర ప్రారంభాన్ని ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. అయితే, ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంతకాలం పాటు నిర్మాణ పనులు నిలిపివేశారు. తాజాగా.. మళ్లీ ఆలయ నిర్మాణ పనులు పున:ప్రారంభించారు. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్​సహా రెండో అంతస్తు పనులు వెంటనే మొదలుకానున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, మందిరంలో కొలువుదీరని బాలరాముడిని దర్శనం కోసం రోజూ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రారంభోత్సవం నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story