- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య లైవ్ బ్యాన్ చేయాలని సర్కార్ ఆదేశం.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని ఆలయాల్లో ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని బ్యాన్ చేయాలని డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన మౌఖిక ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ రాష్ట్ర బీజేపీ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట యొక్క పవిత్రమైన సందర్భాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డీఎంకే రాజకీయ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం లైవ్ బ్యాన్ చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. కాగా ఇదే విషయంపై మద్రాస్ హైకోర్టు సైతం కీలక తీర్పు చెప్పింది. దేవాలయాల్లో ఎల్ ఈడీ స్కీన్ పై రామ మందిర కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది.
BIG BREAKING NEWS 🚨 Madras High Court rules that there is no permission required for screening of Ram Temple event on a LED screen in private temples and halls.
— Times Algebra (@TimesAlgebraIND) January 22, 2024
Supreme Court also issues notice to the Tamil Nadu government and others on a plea filed against State’s oral order… pic.twitter.com/vCXn5jZj6p