దేశంలో రామరాజ్యం ప్రారంభం: అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్

by samatah |
దేశంలో రామరాజ్యం ప్రారంభం: అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడారు. ప్రాణప్రతిష్ట వేడుకతో దేశంలో నేటి నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుందని తెలిపారు. అన్ని అసమానతలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అయోధ్య నుంచి యావత్ దేశానికి వచ్చే మార్పు చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సామరస్యంగా జీవిస్తారు. అందరిపైనా శ్రీరాముడి ఆశీర్వాదం ఉంటుంది’ అని చెప్పారు. రామ్‌లల్లా రాకతో కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. మరోవైపు రామమందిర వేడుకకు హాజరయ్యే ప్రముఖులంతా అయోధ్యకు చేరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed