- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు
దిశ, నేషనల్ బ్యూరో: మరికొన్ని గంటల్లో అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీంతో ఆధ్యాత్మిక నాయకులు, రాజకీయ ప్రముఖులు, ప్రఖ్యాత కళాకారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అయోధ్య, లక్నో విమానాశ్రయాలకు చేరుకున్నారు.
జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠం స్వామి విజయేంద్ర సరస్వతి, రాధాస్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన గురీందర్ సింగ్ ధిల్లాన్, నటులు రజనీకాంత్, పవన్ కల్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు. భారత్ ఫోర్జ్ గ్రూప్ బాబా కల్యాణి, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ లక్నో ఎయిర్ పోర్టుకి వచ్చారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, నటులు గజేంద్రచౌహాన్, రణ్ దీప్ హుడా, మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్, క్రికెటర్ అనిల్ కుంబ్లే, నటీ షెఫాలీ షా ఉదయాన్నే లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్ పోర్టులో దిగారు. పొలిటీషియన్ మీనాక్షి లేఖి, నటి కంగనా రనౌత్ అయోధ్య ఎయిర్ పోర్టులో దిగారు.
ఒక్కరోజే 40కిపైగా చార్టర్ విమానాలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాయని అయోధ్య మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార తెలిపారు. గోరఖ్ పూర్, వారణాసి, ఖుషీనగర్, ప్రయాగ్ రాజ్, లక్నో ఎయిర్ పోర్టులవైపు విమానాలు మళ్లించామన్నారు. ఉదయం 10:25 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ రానున్న ఫ్లైట్ ల్యాండ అవ్వనుంది. అందుకోసం పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీఐఎస్ఎఫ్.