అయోధ్య రాముడికి ‘బాలక్ రామ్’‌గా నామకరణం

by Hajipasha |
అయోధ్య రాముడికి ‘బాలక్ రామ్’‌గా నామకరణం
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో కొత్తగా ప్రతిష్ఠితమైన బాలరాముడికి ‘బాలక్ రామ్’ అని నామకరణం చేశారు. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడిని తలపించేలా విగ్రహం ఉన్నందున దీనికి ఈ పేరును పెట్టామని పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. 51 అంగుళాల ఎత్తున్న ఈ దేవతా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఇందుకోసం 300 కోట్ల సంవత్సరాల వయసు కలిగిన ప్రాచీన నల్లరాతి శిలను వినియోగించారు. దీన్ని మైసూరులోని హెచ్‌డీ కోటే తాలూకా జయపుర హుబ్లీలోని గుజ్జేగౌడనపురలో సేకరించారు. మృదువైన ఉపరితల ఆకృతి కారణంగా ఈ నలుపు శిలను సోప్‌స్టోన్ అని పిలుస్తారు. విగ్రహాలను చెక్కడానికి ఈ శిల చాలా అనువుగా ఉంటుంది. వాస్తవానికి రామమందిరం కోసం గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ పాండే అనే ముగ్గురు శిల్పులతో రామ్‌లల్లా విగ్రహాలను తయారు చేయించారు. అయితే చివరకు అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశారు. మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని ఇతర అంతస్తుల్లో ప్రతిష్ఠిస్తారు.

Advertisement

Next Story