- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యకు అత్యంత ఖరీదైన రామాయణం బహూకరణ: దాని విలువ ఎంతంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కానుకలు ఆయోధ్యకు చేరాయి. ఈ క్రమంలోనే రామాలయానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని మనోజ్ సతీ అనే వ్యక్తి అందజేశాడు. దీని ధర రూ. 1.65 లక్షలు. ఈ పుస్తకంలో రామ మందిరాన్ని పోలి ఉండేలా రూపొందించిన మూడు పెట్టెలు, ఆలయానికి చెందిన మూడు అంతస్తులు చిత్రించబడి ఉన్నాయి. పుస్తకానికి ఉపయోగించిన కాగితం ఫ్రాన్సులో తయారు చేయగా.. ఇది యాసిడ్ రహిత పేటెంట్ కాగితం. పుస్తకం ముఖచిత్రం ఈ పదార్థంతోనే రూపొందించారు. అయితే అందులో ఉపయోగించిన ఇంక్ జపాన్ నుంచి దిగుమతి అయింది. అంతేగాక దీని రూపకల్పనకు అమెరికన్ వాల్‌నట్ కలప, కుంకుమపువ్వు ఉపయోగించారు. 45 కిలోల బరువున్న ఈ పుస్తకం 400 ఏళ్లకు పైగా కొనసాగుతుందని మనోజ్ సతీ తెలిపారు. ఈ పుస్తకాన్ని నాలుగు తరాలు చదవొచ్చని చెప్పారు. ప్రతి పేజీలో ఒక విభిన్నమైన డిజైన్ ఉండటం దీని ప్రత్యేకత అని వెల్లడించారు.