- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యువకుడి ప్రతిభ అద్భుతం.. అగ్గిపుల్లలతో రామమందిర నిర్మాణం..
దిశ, ఫీచర్స్ : జనవరి 22 సోమవారం దేశం మొత్తానికి ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన జరిగిన రోజు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశ నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ చూసినా రామనామస్మరణతో మార్మోగుతోంది. ఈ క్రమంలో అయోధ్య నుండే కాదు దేశం నలుమూలల నుండి విడుదలైన వివిధ రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఇటీవల, ఒక వ్యక్తి పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి రామాలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు మరో వ్యక్తి అగ్గిపుల్లలను ఉపయోగించి రామమందిరాన్ని తయారు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. దీని చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరు పూర్తివివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశాకు చెందిన శిల్పి శాశ్వత రంజన్ అగ్గిపుల్లలను ఉపయోగించి అయోధ్య రామాలయం అద్భుత ప్రతిరూపాన్ని సృష్టించాడు. ఇతను మీడియాతో మాట్లాడుతూ ఈ రామ మందిర ప్రతిరూపాన్ని తయారు చేయడానికి తనకు మొత్తం ఆరు రోజులు పట్టిందని, మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించారని సాస్వత్ చెప్పారు. ఈ ఆలయం 4 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పుతో ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకంటే చిన్న రామ మందిరాన్ని అగ్గిపుల్లతో నిర్మించవచ్చని తాననుకోవడం లేదని సాస్వత్ చెప్పారు. ఈ రామ మందిరాన్ని ప్రధాని మోదీకి అప్పగించాలనుకుంటున్నట్లు చెప్పారు.