- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maruti Suzuki Dzire: రూ .6.79 లక్షల ప్రారంభ ధరతో కొత్త మోడల్ డిజైర్ కారును విడుదల చేసిన మారుతీ సుజుకీ
దిశ, వెబ్‌డెస్క్: దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ(Maruti Suzuki) కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్లు తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో అందుబాటులో ఉండటంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ సంస్థ సరికొత్త డిజైన్(New Design)తో డిజైర్ 2024(Dzire 2024)ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. రూ .6.79 లక్షల ప్రారంభ ధర(Ex-Showroom)తో దీన్ని ప్రవేశపెట్టారు. టాప్ మోడల్ ధర రూ .9.69 లక్షలుగా ఉంది. అయితే ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపనీ తెలిపింది. కాగా ఈ కార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ(NCAP)లో 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. ఈ రేటింగ్ అందుకున్నా మొదటి మారుతీ కారు కూడా ఇదే కావడం విశేషం.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త డిజైర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్(Three Cylinder Petrol Engine)ను కలిగి ఉంది. ఇది 5700 ఆర్‌పీఎమ్(RPM) వద్ద 82 హార్స్ పవర్(HP) శక్తిని, 4300 ఆర్‌పీఎమ్(RPM) వద్ద 112 ఎన్ఎమ్ టార్క్(Nm Torque)ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక మైలేజీ పరంగా చూస్తే.. మాన్యువల్ గేర్ బాక్స్ కారు లీటరుకు 24.79 కిలోమీటర్లు, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు లీటరుకు 25.71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సిక్స్ సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఇచ్చారు. అలాగే కార్ లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇంఫోన్టైన్ మెంట్ స్క్రీన్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, ఆటో ఫోల్డింగ్ వంటివి ఉన్నాయి.