Honda CB300F: హోండా నుంచి కొత్త బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!

by Maddikunta Saikiran |
Honda CB300F: హోండా నుంచి కొత్త బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan) కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ 'హోండా సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ ఇండియా' నుంచి కొత్త మోడల్ బైక్ మార్కెట్ లోకి విడుదలైంది. దీని పేరు హోండా CB300F(Honda CB300F). ఇండియాలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్(Flex Fuel) బైక్ ఇది. ఈ కొత్త బైక్ స్పోర్ట్స్ రెడ్(Sports Red), మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్(Matt Axis Gray Metallic colors)లో కొనుగోలుకు ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1.70 లక్షలు(ex-showroom-Delhi)గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ బుకింగ్లు(Bookings) ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని కంపెనీ తెలిపింది. ఈ నెల చివరి వారం నుంచి హోండా షోరూం(Honda Showroom)లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్ 293.52 సీసీ , 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 24.5 BHP పవర్, 25.9Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. అలాగే అసిస్టెంట్ స్లిప్ క్లచ్ తో వస్తోంది. ముందు 276 mm, వెనుకవైపు 220 mm వేవ్ డిస్క్ లను కలిగి ఉంది. బైక్ రెండు చివర్లలో ABSతో కూడిన డిస్క్ బ్రేక్‌లతో దీనిని తీసుకొచ్చారు. అలాగే LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనిలో స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed