Dashcam : కారులో డాష్‌క్యామ్ ఎందుకు పెడతారు.. అది లేకపోతే ఏం చేయాలి ?

by Sumithra |
Dashcam : కారులో డాష్‌క్యామ్ ఎందుకు పెడతారు.. అది లేకపోతే ఏం చేయాలి ?
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలావరకు మనం కార్లకు డాష్‌క్యామ్ ఉండడాన్ని చూస్తుంటాం. డాష్‌క్యామ్ అంటే డ్యాష్‌బోర్డ్ కెమెరా. ఈ డాష్‌క్యామ్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ డాష్‌క్యామ్ ను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రహదారి, ట్రాఫిక్ కార్యకలాపాలను రికార్డ్ చేసేందుకు వాహన డాష్‌బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఇంతకీ ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాదం జరిగితే, డాష్‌క్యామ్ ఫుటేజ్ తప్పు ఎవరిది అని నిరూపించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ప్రమాద బీమా క్లెయిమ్‌లు చేయడం, పోలీసు నివేదికలను ఫైల్ చేయడానిక ఈ క్యామ్ లోని ఫుటేజి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం జరిగినట్లు నటించి ఇన్సూరెన్స్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. డాష్‌క్యామ్ అటువంటి మోసాలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను అందించగలదు. డాష్‌క్యామ్ ద్వారా మీ ప్రయాణంలో అందమైన దృశ్యాలు, మరపురాని క్షణాలను కూడా రికార్డ్ చేయగలదు. వీటిని మీరు తర్వాత చూసుకుని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే మీ సన్నిహితులకు కూడా మంచి అనుభవాలను షేర్ చేయవచ్చు.

డాష్‌క్యామ్ లేకపోతే ఏమి చేయాలి ?

మీ వాహనంలో డాష్‌క్యామ్ లేకపోతే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ను డాష్‌క్యామ్‌గా ఉపయోగించేందుకు కొన్ని యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు CCTV కెమెరాలు అమర్చిన ప్రదేశాల్లో మీ కారును పార్క్ చేయండి. దీనితో మీరు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఫుటేజీని తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed