Bajaj Pulsar N125: బజాజ్ పల్సర్ నుంచి కొత్త బైక్ లాంచ్.. ధర, ఇంజిన్, ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలివే..!

by Maddikunta Saikiran |
Bajaj Pulsar  N125: బజాజ్ పల్సర్ నుంచి కొత్త బైక్ లాంచ్.. ధర, ఇంజిన్, ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ పల్సర్ బైక్(Bajaj Pulsar Bike)లకు యూత్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని పేరు 'బజాజ్ పల్సర్ ఎన్125(Bajaj Pulsar N125)'. దీని ప్రారంభ ధర రూ. 94,707(ex-showroom-Delhi)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త బైక్ పర్పుల్ ఫ్యూరీ, కాక్టెయిల్ వైన్ రెడ్, సిట్రస్ రష్, ఎబోనీ బ్లాక్, కరేబియన్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ వైట్ కలర్స్ లో కొనుగోలుకు ఉంటుంది. ఈ బైక్ ఇప్పటి వరకు ఉన్న పల్సర్‌ బైక్‌ల కంటే సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఎయిర్ కూల్డ్ యూనిట్ ను కలిగి ఉంది. ఇది 11.8 BHP పవర్, 11 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు. ఈ బైక్ రెండు స్ప్లిట్ సీట్ కలిగి ఉంది. అలాగే ఇన్ బిల్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తోంది. స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టూ పీస్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, హాలోజెన్ బల్బ్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. దీనిలో స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, LCD స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Next Story