మహేశ్‌కు థాంక్స్ చెప్పిన శ్రీనువైట్ల

by Jakkula Samataha |   ( Updated:2020-09-23 07:42:19.0  )
మహేశ్‌కు థాంక్స్ చెప్పిన శ్రీనువైట్ల
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు శ్రీనువైట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దూకుడు’. ప్రేక్షకులకు సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశాడు డైరెక్టర్ శ్రీను వైట్ల.

‘దూకుడు’ సినిమా ఆన్ అండ్ ఆఫ్ సెట్స్‌లో ప్రతీ నిమిషం ఆనందించేలా, ప్రేమించేలా చేసిందన్నారు. ఈ చిత్రం తన కెరియర్‌లో మైలురాయి అని తెలిపిన శ్రీను వైట్ల.. క్రేజీ అండ్ ఎమోషనల్ జర్నీలో భాగమైన మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.

Advertisement

Next Story