తెలంగాణలో ఒక్కరోజే 920 కేసులు

by vinod kumar |
తెలంగాణలో ఒక్కరోజే 920 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజల్లో కలవరం రేపుతుంది. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో ఏకంగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 737 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 230కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,364 కేసులు నమోదు కాగా.. ఇందులో 4,688 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు ఒక్కరోజే 327 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 6,446 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

Next Story

Most Viewed